- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఘాటి’ నుంచి బిగ్ అప్డేట్ రాబోతుందంటూ ఊహించని పోస్ట్‌తో షాకిచ్చిన మూవీ మేకర్స్.. హైప్ పెంచుతున్న పోస్టర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్స్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఒకప్పుడు వరుస చిత్రాల్లో నటించిన అనుష్కఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన స్వీటీ సడెన్‌గా ‘సైజ్ జీరో’ మూవీతో బరువు అమాంతం పెరిగిపోయింది. ‘బాహుబలి’లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్దులను చేసింది. చివరగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’(Ghati). క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు(Vikram Prabhu) కీలక పాత్రలో కనిపించనున్నాడు.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 11న థియేటర్స్‌లో రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ రాబోతున్నట్లు వెల్లడించారు. సైలోర్ అని సాగే ఈ పాట జూన్ 21న శనివారం నాడు రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఊహించని పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇక ఇందులో అనుష్క పెళ్లి కూతురి గెటప్‌లో బుగ్గ చుక్కతో కనిపించగా.. విక్రమ్ భుజంపై చేతివేసి మరీ ఫొటో దిగింది. ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్లలో అంచనాలు మరింత పెరిగాయి.






