- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మౌనీ రాయ్ సర్జరీ రచ్చ.. నటీనటుల పర్సనల్ లైఫ్ మీ వంటగది కాదంటూ నటి వార్నింగ్
మౌనీ రాయ్ లేదా ఏ ఇతర నటీనటులైనా సరే.. వారు ఏం చేసుకుంటున్నారో అది వారి వ్యక్తిగత విషయం. ఇది మీ వంటగది కాదు, అక్కడ వండుతున్నది మీ వంటకం అంతకంటే కాదు

దిశ, సినిమా: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ చుట్టూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న సర్జరీ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. మౌనీ రాయ్ తన లుక్ విషయంలో చేసిన మార్పులపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుండటంతో, ఆమెకు మద్దతుగా నటి పవిత్ర పునియా రంగంలోకి దిగింది. ఇటీవల ‘ది డెవిల్ వేర్స్ ప్రాడా 2’ స్పెషల్ స్క్రీనింగ్ వేడుకకు మౌనీ రాయ్ హాజరయ్యారు. అక్కడ ఆమె ఎంతో స్టైలిష్‌గా కనిపించినప్పటికీ, కొందరు నెటిజన్లు ఆమె ముఖ కవళికలను టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు. మౌనీ రాయ్ తన అందాన్ని పెంచుకోవడానికి పదే పదే సర్జరీలు చేయించుకుంటోందని, ఆమె సహజత్వం కోల్పోయిందంటూ నెగటివ్ కామెంట్స్ చేశారు. ఈ ఫోటోలను కొన్ని సోషల్ మీడియా పేజీలు పనిగట్టుకుని వైరల్ చేస్తూ, మౌనీని కించపరిచేలా క్యాప్షన్లు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.
ఈక్రమంలో.. తాజాగా, మౌనీ రాయ్‌పై జరుగుతున్న ఈ దాడిని చూసి నటి పవిత్ర పునియా ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌని రాయ్ ఫోటోను షేర్ చేస్తూ ట్రోలర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. "మౌనీ రాయ్ లేదా ఏ ఇతర నటీనటులైనా సరే.. వారు ఏం చేసుకుంటున్నారో అది వారి వ్యక్తిగత విషయం. ఇది మీ వంటగది కాదు, అక్కడ వండుతున్నది మీ వంటకం అంతకంటే కాదు" అంటూ పవిత్ర మండిపడ్డారు. ముఖ్యంగా మౌనీ రాయ్ లక్ష సర్జరీలు చేయించుకుందంటూ ఎగతాళి చేసే వారికి, "ఆ సర్జరీల కోసం మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కదా" అని ఘాటుగా బదులిచ్చారు. మౌనీ రాయ్ అందాన్ని విమర్శిస్తూ పేజీల ఎంగేజ్‌మెంట్ పెంచుకోవాలని చూస్తున్న వారిపై పవిత్ర విరుచుకుపడ్డారు. మౌనీ వంటి నటీనటులు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వస్తారని, వారిని కేవలం ఒక ఫోటో లేదా లుక్ ఆధారంగా జడ్జ్ చేయడం సరైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. మౌనీ ఇప్పటికే ‘నాగిని’ సీరియల్ ‘బ్రహ్మాస్త్ర’ వంటి సినిమాలతో తన నటనను నిరూపించుకున్నారని, ఆమె వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని పవిత్ర కోరారు. మొత్తానికి మౌనీ రాయ్ చుట్టూ తిరుగుతున్న ఈ సర్జరీ వివాదం సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛపై మరోసారి పెద్ద చర్చను లేవనెత్తింది. మౌనీ రాయ్ ఈ విషయంలో మౌనంగా ఉన్నప్పటికీ, ఆమె తరపున పవిత్ర ఇచ్చిన కౌంటర్లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.






