బాలీవుడ్ సినిమాలు చాలా వరకు ఫేక్ ఉంటున్నాయి.. ప్రియదర్శన్ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ సినిమాలు చాలా వరకు ఫేక్ ఉంటున్నాయి. అక్కడ కథల్లో సహజత్వం లోపిస్తోంది. ప్రతిదీ ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది. మేకింగ్ విషయంలో వాస్తవికతకు దూరంగా జరిగిపోతున్నారు

బాలీవుడ్ సినిమాలు చాలా వరకు ఫేక్ ఉంటున్నాయి.. ప్రియదర్శన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తాజాగా బాలీవుడ్ సినిమాలపై చేసిన విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. హిందీ చిత్రసీమలో దశాబ్దాల కాలం పాటు పనిచేసి, ఎన్నో సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన ఆయన, ఇప్పుడు అదే ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణాది సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు ప్రభావాన్ని చూపిస్తున్నాయో వివరిస్తూ.. "సౌత్ చిత్రాల్లో ఉండే వాస్తవికత హిందీ సినిమాల్లో కనిపించదు. పుష్ప లేదా కాంతార లాంటి సినిమాలను తీసుకోండి.. వాటిని ఎంత సహజంగా తీస్తారంటే, ఆ కథలు మన కళ్ల ముందే నిజంగా జరిగాయేమో అనిపిస్తుంది. అక్కడ మట్టి వాసన, పాత్రల వేషధారణ అంతా చాలా నేచురల్‌గా ఉంటాయి" అని ఆయన కొనియాడారు.

ఇదే క్రమంలో బాలీవుడ్ సినిమాలపై ఆయన విమర్శలు గుప్పించారు. "బాలీవుడ్ సినిమాలు చాలా వరకు ఫేక్ ఉంటున్నాయి. అక్కడ కథల్లో సహజత్వం లోపిస్తోంది. ప్రతిదీ ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది. మేకింగ్ విషయంలో వాస్తవికతకు దూరంగా జరిగిపోతున్నారు" అని ప్రియదర్శన్ అభిప్రాయపడ్డారు. హిందీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉన్న సత్తా ఇప్పుడు కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రియదర్శన్ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ విషయంపై దక్షిణాది అభిమానులు ఆయన మాటలను సమర్థిస్తుంటే, కొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో వరుస హిట్లు కొట్టిన ప్రియదర్శన్, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story