‘Moruniye’.. ‘చంద్రముఖి 2’ సెకండ్‌ సింగిల్‌ చూస్తే పూనకాలే

by Disha Web Desk 7 |
‘Moruniye’.. ‘చంద్రముఖి 2’ సెకండ్‌ సింగిల్‌ చూస్తే పూనకాలే
X

దిశ, సినిమా: రాఘ‌వ లారెన్స్, పి.వాసు కాంబోలో వస్తున్న కామెడీ అండ్ హారర్ ఫిల్మ్ ‘చంద్రముఖి 2’ నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చంద్రముఖిగా కనిపించనున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ ‘స్వాగతాంజలి’కి భారీ స్పందన రాగా.. తాజాగా విడుదలైన రెండో పాట ‘Moruniye’ ప్రేక్షకులను అలరిస్తోంది.

లారెన్స్‌ డ్యాన్సింగ్ స్టైల్‌తో సాగిన ఈ పాట.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. వివేక్‌ రాసిన సాంగ్‌ను కీరవాణి కంపోజ్ చేయగా.. ఎస్పీ చరణ్‌, హారికా నారాయణ్‌ అద్భుతంగా ఆలపించారు. ఇదిలావుంటే.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో రాఘవ లారెన్స్‌ రాజసం ఉట్టిపడేలా చేతిలో ఖడ్గం పట్టుకొని కనిపించగా సెకండ్ లుక్‌లో చంద్రముఖి భవంతి ద్వారంలోకి వెళ్లి తలుపులో నుంచి లోపలికి చూస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాడు. ఇక ఈ మూవీ తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదలకానుంది.

ఇవి కూడా చదవండి: Mega Star బర్త్‌డే స్పెషల్.. Prabhas ‘కల్కి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

Next Story

Most Viewed