- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోహన్‌లాల్ ‘వృషభ’ సినిమా టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ ‘వృషభ’ (Vrusshabha)పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో షోభా కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సైరభ్ మిశ్రా, అభిషేక్, విశాల్ గుర్నాని, ఎక్తా ఆర్. కపూర్ నిర్మిస్తున్నారు. ఇందులో సమర్జిత్ లంకేష్, షానయా కపూర్(Shanaya Kapoor), జహ్రా ఎస్, ఖాన్, శ్రీకాంత్, రాగిణి ద్వివేది కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ మాస్ యాక్షన్ డ్రామా షూటింగ్ పూర్తి చేసుకోగా అక్టోబర్ 16న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా, మోహన్ లాల్ ‘వృషభ’ సినిమాకు సంబంధించిన టీజర్ సెప్టెంబర్ 18న రాబోతున్న చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ఇది పోరాటాలు, భావోద్వేగాలతో కూడి ఉండబోతున్నట్లు తెలుపుతూ.. ఒక త్రిశూలం వెనకాల నుంచి మోహన్ లాల్ వెరైటీ గెటప్‌తో చూస్తున్నట్లు ఉన్న పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేసి క్యూరియాసిటీని పెంచారు.






