- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మొగలిరేకులు హీరో..ఫ్యాన్స్‌కు పండగే!
జెమినిటీవీలో ప్రసారమైన మొగలి రేకులు సినిమా ఎంత మంచి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ సీరియల్‌కు ఉన్న క్రేజీనే వేరు. ఇక ఈమూవీలో ఆర్కేనాయుడు, మున్నా, పాత్రల్లో

దిశ, సినిమా : జెమినిటీవీలో ప్రసారమైన మొగలి రేకులు సినిమా ఎంత మంచి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ సీరియల్‌కు ఉన్న క్రేజీనే వేరు. ఇక ఈమూవీలో ఆర్కేనాయుడు, మున్నా, పాత్రల్లో నటించి ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ నిలిచిపోయాడు సాగర్.
పోలీస్ ఆఫీసర్‌గా ఈ సీరియల్‌లో ఈయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే మరోసారి సాగర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ద100 అనే సినిమాతో సందడిచేయనున్నాడు.
ఓంకార్ శశిధర్ ద 100 సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారి పాత్రలో సాగర్ నటిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అలాగే కమర్సియల్ ఎలిమెంట్స్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు.






