APOLOGY : నీ భర్తతో సరసాలు ఆడినందుకు సారీ... హీరోయిన్‌కు‌ పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పిన అందాల భామ

by Sujitha Rachapalli |
APOLOGY : నీ భర్తతో సరసాలు ఆడినందుకు సారీ... హీరోయిన్‌కు‌ పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పిన అందాల భామ
X

దిశ, సినిమా : హీరోయిన్ కియారా అద్వానీ.. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా డ్రీమ్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు కూడా తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. షో స్టాపర్స్ గానూ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో సూపర్ హాట్ గా కనిపించాడు సిద్ధు. బ్లాక్ సూట్ లో మెరిసిపోయాడు. కాగా ఇదే కార్యక్రమంలో ఓ మోడల్ ఆయనను చూసి ఫ్లాట్ అయిపోయింది. స్టేజ్ పైనే ఫ్లర్టింగ్ మొదలుపెట్టేసింది. ఎంతలా అంటే సిద్ధు కూడా ఆల్మోస్ట్ అన్ కంఫర్ట్ ఫీల్ అయ్యేలా చేసింది. అయినా సరే ప్రోగ్రాం కాబట్టి నార్మల్ గా ఉండక తప్పలేదు.

అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు కూడా కియార చూస్తే ఎంత ఏడుస్తుందోనని కామెంట్స్ చేశారు. ఇక ఈ క్లిపింగ్ నెట్టింట చూసిన మోడల్ భామ.. తను చేసిన పని ఇంత అసౌకర్యంగా ఉందా అని ఫీల్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా కియారకు పబ్లిక్ గా అపాలజీ చెప్పింది. 'నీ భర్తతో అలా చేసినందుకు క్షమించు' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం మంచి వ్యక్తిత్వం కలిగిన వారి లక్షణమని కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

AISWARYA RAI - ABHISHEK BACHAN : ఐశ్వర్యతో విడాకులపై సస్పెన్స్‌కు తెరదించిన అభిషేక్ బచ్చన్.. సారీ అంటూ ప్రకటన...



Next Story