‘అఖండ-2’ కోసం రంగంలోకి మిశ్రా ద్వయం.. గూస్ బంప్స్ ఖాయం అంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-13 06:34:31  IST  )

నందమూరి బాలకృష్ణ( Balakrishna ), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో రాబోతున్న ‘అఖండ-2:తాండవం’(Akhanda-2: Tandavam).

‘అఖండ-2’ కోసం రంగంలోకి మిశ్రా ద్వయం.. గూస్ బంప్స్ ఖాయం అంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ( Balakrishna ), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో రాబోతున్న ‘అఖండ-2:తాండవం’(Akhanda-2: Tandavam). ఈ సినిమా 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్‌ అయిన ‘అఖండ’కు సీక్వెల్‌గా రాబోతుంది. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తోన్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్ నటిస్తుండగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. తమన్ ‘అఖండ-2’ అప్డేట్ ఇచ్చారు. ‘అఖండ’కి తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు తమన్. ఇందుకోసం సంస్కృత శ్లోకాలు, వేద మంత్రాలు చెప్పడంలో నిపుణులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దించారు.

ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. ‘‘పండిట్ ద్వయం శ్రవణ్ మిశ్రా మరియు అతుల్ మిశ్రా.. అఖండ2 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం సిద్ధంగా ఉన్నారు. తమన్ స్కోర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. దైవిక మంత్రాలతో అద్భుతమైన స్కోర్ కోసం సిద్ధంగా ఉండండి. గూస్ బంప్స్ ఖాయం’’ అని వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇక థియేటర్స్‌లో రుద్ర తాండవమే అని అభిప్రాయపడుతున్నారు.

Next Story