‘ఉగ్రం’.. ‘నాంది’ కంటే పదిరేట్లు ఉత్కంఠగా ఉంటుంది: అల్లరి నరేష్

by Disha Web Desk 7 |
‘ఉగ్రం’.. ‘నాంది’ కంటే పదిరేట్లు ఉత్కంఠగా ఉంటుంది: అల్లరి నరేష్
X

దిశ, సినిమా : అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబోలో వస్తున్న మూవీ ‘ఉగ్రం’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఖమ్మంలో గ్రాండ్‌గా నిర్వహించగా ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌.. ట్రైలర్‌ లాంచ్ చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అలాగే తమకు బెస్ట్ విశేష్ అందించిన మంత్రిగారికి కృతజ్ఞతలు చెప్పిన హీరో నరేష్.. ‘నాంది’లో అండర్ ట్రయిల్ ఖైదీలు గురించి చెబితే ఇందులో మిస్సింగ్ కేసులు గురించి వివరించాం. చాలా రిసెర్చ్ చేసిన కథ ఇది. ‘నాంది’ కంటే పదిరేట్లు ఇంటెన్స్‌గా ఉంటుందన్నాడు. చివరగా ‘ఉగ్రం’లో ఎమోషన్, యాక్షన్ దద్దరిల్లుతుందని దర్శకుడు విజయ్ కనకమేడల చెప్పగా.. నరేష్ నమ్మకంతో యజ్ఞంలా చేసిన సినిమాను థియేటర్‌‌లోనే చూసి ఆదరించాలని నిర్మాత హరీస్ పెద్ది కోరాడు.

Also Read...

.‘చైత్ర’.. ‘సెల్ఫిష్’ నుంచి ఇవానా పాత్ర పరిచయం


Next Story