ఆహా సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిన మంత్రి మల్లారెడ్డి.. (వీడియో)

by Disha Web Desk 6 |
ఆహా సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిన మంత్రి మల్లారెడ్డి.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇటీవల పలు కాలేజీ ఈవెంట్స్‌లో పాల్టొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాకుండా బయట మాట్లాడిన స్పీజ్‌లతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇటీవల కష్టపడ్డా.. సక్సెస్ అయిన.. అంటూ ఇచ్చిన స్పీచ్ బాగా వైరల్ అయింది. ఇటీవల ఆయన ఇప్పటికే పలు సినిమా ప్రమోషన్స్‌కు హాజరయ్యారు. తాజాగా, ఆహా ఓటీటీ సినిమా కోసం మల్లారెడ్డి మరోసారి రంగంలోకి దిగారు. ఇటీవల ‘సత్తి గాని రెండెకరాలు’ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా నటించిన కేశవ క్యారెక్టర్ చేసిన నటుడు జగదీష్ హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం మల్లారెడ్డిని తీసుకొచ్చి జగదీష్‌తో ఓ ఫన్నీ వీడియోను చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More: SPB Birthday: 16 ప్రాంతీయ భాషల్లో పాడిన గాన గంధర్వుడి ఎస్‌పి బాలు జయంతి నేడు

నేడు స్టార్ హీరోయిన్ ప్రియమణి పుట్టినరోజు..

Next Story