అభిమానికి అదిరిపోయే రిప్లై ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా..

by Dishafeatures1 |
అభిమానికి అదిరిపోయే  రిప్లై ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా..
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న వారిలో తమన్నా ఒకరు. దాదాపు యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించి తక్కువ సమయంలోనే టాక్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ నటించి సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. ఇక హీరోయిన్ గా రాణిస్తూనే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించింది. ప్రస్తుతం తెలుగులో తమిళ్ లో సినిమాలు తగ్గించింది ఈ భామ.. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఇక్కడ వరుస చిత్రాలు.. సిరీస్‌లు చేస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా తమన్నా తన సినీ కెరీర్‌లో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ తమన్నా ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఓ అభిమాని తమన్నా నటించిన సినిమాల్లోని ఫోటోలను కలిపి ఓ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫొటోకు తమన్నా రిప్లై ఇచ్చింది.. ‘ మీరు చూపిస్తున్న ప్రేమకు నా ధన్యవాదాలు. అలాగే ఇలాంటి ఫొటోలు మరిన్ని వస్తాయి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో తమన్నా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అభిమానులకు తమన్నా ఇలా రిప్లై ఇవ్వడం పై నెటిజన్లు కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story