భారీ గుడ్‌న్యూస్..Jai Hanuman’ లో మెగాస్టార్, సూపర్‌స్టార్..!!

by Disha Web Desk 9 |
భారీ గుడ్‌న్యూస్..Jai Hanuman’ లో మెగాస్టార్, సూపర్‌స్టార్..!!
X

దిశ, సినిమా: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసును ఓ ఊపు ఊపింది అనడంలో అతిశయోక్తి లేదు. భారీ వసూళ్లను కొల్లగొట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇక తేజా సజ్జా నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. చిన్న సినిమాగా తెరకెక్కి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీకి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. జై హనుమాన్ అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో ఏ హీరో నటించబోతున్నాడని ఆడియన్స్‌లో క్యూరియాసిటి పెరిగిపోతుంది.

ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఆంజనేయుడి పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని, రాముడి రోల్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. రాముడిగా సూపర్ స్టార్ ఎలా ఉంటారనేది డిజైన్స్ కూడా చేశామని, చాన్స్ దొరికితే పార్ట్-2 లో వీరిద్దరిని తీసుకుంటామని అన్నాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో జై హనుమాన్ సినిమాలో పెద్ద స్టార్ నటించబోతున్నారంటూ హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో అవ్వగా.. ప్రిన్స్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు.


Next Story

Most Viewed