- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్‌తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్‌తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇటీవల బజూకా, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇటీవల అనారోగ్య సమస్యలు రావడంతో కొద్ది కాలంపాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. చికిత్స తీసుకున్న మమ్ముట్టి ఇటీవల తాను కోలుకున్నట్లు ప్రముఖ నిర్మాత పోస్ట్‌తో వెల్లడించారు. దీంతో అభిమానులు ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.
ఈనేపథ్యంలో.. తాజాగా, మమ్ముట్టి ‘కలమ్ కవల్’ (Kalam Kaval)టీజర్ రాబోతున్నట్లు వెల్లడించారు. అది కూడా ఆగస్టు 28న ఓనమ్ సందర్భంగా విడుదల కాబోతున్న కళ్యాణి ప్రియదర్శన్ ‘లోకా’ థియేటర్స్‌లో ప్రసారం కాబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మమ్ముట్టి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమాకు జితిన్ కె జోస్ (Jithin K Jose)దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వినాయకన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మమ్ముట్టి సొంత బ్యానర్‌లో స్వయంగా ఆయనే నిర్మిస్తు్న్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.






