- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆట సందీప్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్.. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజంటూ ఎమోషనల్ నోట్
ట సందీప్ మాస్టర్(Sandeep Master), జ్యోతి(Jyothi) దంపతులకు పరిచయం అక్కర్లేదు.

దిశ, సినిమా: ఆట సందీప్ మాస్టర్(Sandeep Master), జ్యోతి(Jyothi) దంపతులకు పరిచయం అక్కర్లేదు. వీరిద్దరు పలు డ్యాన్స్ షోలో, అలాగే ఢీ జోడీలో పాల్గొని తమ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ జంట వేసే స్టెప్పులు నిమిషాల్లో వైరల్ అవుతాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక సందీప్ మాస్టర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ పాల్గొన్నారు. కానీ విన్నర్ కాలేకపోయాడు. ప్రస్తుతం పలు సినిమాలకు డ్యాన్స్ కొనియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), డ్యాన్స్ మాస్టర్ సందీప్, జ్యోతిలను ఇంటికి పిలిచి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. సందీప్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజు!
స్వయంగా ఆ దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు లా దిగివచ్చి మాకు వరం ఇచ్చినట్టుగా అనిపించింది… ఎన్నేళ్లుగా నేను నమ్ముకున్న నా డాన్స్‌ను, నా కష్టాన్ని చూసి ఆయనే స్వయంగా నన్ను ఇంటికి పిలిచి, నాకు కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చారు.ఆ క్షణం నాకు సాక్షాత్ పరమశివుడు ఆశీర్వాదం చేసినట్టుగా అనిపించింది. అది పూర్తిగా దైవానుగ్రహం లాంటి అనుభూతి.. హృదయం మొత్తం ఆనందంతో నిండిపోయింది. అందులోను మా జంట గురించి, నా వైఫ్ జ్యోతి గురించి ఆయన చెప్పిన మాటలు.. మాకు ఇచ్చిన ఆశీర్వాదాలుగా భావిస్తున్నాం. మా జీవితానికి కొత్త బలం, ముందుకు నడిపించే పెద్ద ధైర్యం ఇచ్చాయి.
ఆ మాటలు మా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. చిరంజీవి గారు స్వయంగా పిలిచి ఇచ్చిన ఈ అవకాశం..చిన్నప్పటి నుండి కలగన్న ఆ కల నిజంగా నెరవేరిన రోజు. ఆయనతో కూర్చొని మాట్లాడిన ప్రతీ క్షణం, ఆయన చూపిన ఆప్యాయం, వినయం, ప్రేమ. అన్నీ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులయ్యాయి. ధన్యవాదాలు చిరంజీవి గారూ.. ఈ అవిస్మరణీయ అవకాశం, మీ ఆశీర్వాదాలు, మీ ప్రేమ—ఇవి నాకు కొత్త దారి, కొత్త శక్తి ఇచ్చాయి’ అని రాసుకొచ్చాడు. అలాగే చిరంజీవితో తీసుకున్న ఫొటోలను షేర్ చేశాడు.






