- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరిగిన చొక్కాతో పెళ్లి పీటలెక్కిన మెగాస్టార్.. దానికి కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే?
నేడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)పుట్టినరోజు కావడంతో పలు సంఘటలకు సంబంధించిన వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

దిశ, సినిమా: నేడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)పుట్టినరోజు కావడంతో పలు సంఘటలకు సంబంధించిన వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా, మెగాస్టార్ పెళ్లి రోజుకు సంబంధించిన ఓ ఇన్సిడెంట్ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. చిరు పెళ్లి రోజున ఆయన చిరిగిన చొక్కాతో సురేఖ మెడలో తాళికట్టారు. అయితే పెళ్లి పీటలపై కూర్చున్న సమయంలో ఎవరో చొక్కా చిరిగింది అనగానే.. షర్ట్ చిరిగితే తాళి కట్టనివ్వరా అని కొంటెగా బదులిచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. మరోసారి ట్రెండ్ అవుతోంది. అయితే అలా చిరిగిన చొక్కా వేసుకోవడానికి కారణం.. అదే రోజున MSరెడ్డి నిర్మించిన ‘తాతయ్య ప్రేమలీలలు’ షూటింగ్ జరగడంతో డ్రెస్ మార్చుకునే సమయం లేక చిరిగిన చొక్కాతోనే తాళి కట్టారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అంత పెద్ద స్టార్ అయిండి చిరిగిన చొక్కాతో పెళ్లి చేసుకోవడం గ్రేట్ అని అంటున్నారు.
ఇటీవల ప్రీ వెడ్డింగ్, సంగీత్ అంటూ పెళ్లికే ఆస్తులను సైతం అమ్ముకుంటున్నారు. ఇంకా బట్టల విషయం చెప్పనక్కర్లేదు. కొన్ని లక్షలు పెట్టి తమకు నచ్చిన దుస్తులను సెలబ్రిటీల మాదిరిగా కాస్ట్యూమ్ డిజైనర్‌తో రెడీ చేయించుకుంటున్నారు. లేట్ అయినా సరే ముస్తాబయ్యేందుకే అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాంటిది మెగాస్టార్ చిరిగిన చొక్కాతో మెగాస్టార్ తాళి కట్టడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా.. చిరు సినిమాల విషయానికొస్తే.. త్వరలో ‘విశ్వంభర’ (Vishvambhara)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చేస్తున్నారు. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు ప్రకటన కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే బాబీ దర్శకత్వంలో ‘మెగా-158’ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుంది.






