ఆ రోజును లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను : Megastar Chiranjeevi ఎమోషనల్

by Mallepaka Hamsa |   (  Updated:2022-08-22 07:23:57  IST  )

దిశ, సినిమా : తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని యంగ్ జనరేషన్ హీరోలకు ఆదర్శంగా నిలిచిన నటుడు చిరంజీవి..Latest Telugu News

ఆ రోజును లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను : Megastar Chiranjeevi ఎమోషనల్
X

దిశ, సినిమా : తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని యంగ్ జనరేషన్ హీరోలకు ఆదర్శంగా నిలిచిన నటుడు చిరంజీవి. ఆయన తర్వాత ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నప్పటికీ ఎవరూ కూడా చిరు స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. ఇక నేడు(ఆగస్ట్‌ 22) 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తనకు పుట్టినరోజు కన్నా సెప్టెంబర్ 22 అంటేనే చాలా ప్రత్యేకమని ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

దీనికి కారణం చిరు మొదటి సినిమా 'పునాది రాళ్లు' అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించిన 'ప్రాణం ఖరీదు' సినిమానే ముందుగా(1978 సెప్టెంబర్ 22) విడుదలై ఘనవిజయం సాధించింది. అందుకే ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని, తాను కొణిదెల శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన రోజు అదేనని పేర్కొన్నారు. అందుకే సెప్టెంబర్ 22 అంటే తనకు చాలా ప్రత్యేకమని వెల్లడించారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

సల్మాన్ ఖాన్‌తో ఎంట్రీ.. అదిరిపోయిన Mega Star Birthday గిఫ్ట్

మా అన్నా, తమ్ముడిని ఏమన్నా అంటే తాటా తీస్తా.. Nagababu వార్నింగ్

Next Story