- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ చిరంజీవి చాలా సెన్సిటివ్.. దయచేసి ఇంకా బాధపెట్టకండి!
మెగా డాటర్ నిహారిక-చైతన్య జొన్నలగడ్డతో తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక-చైతన్య జొన్నలగడ్డతో తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా నిహారికే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2020 డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా నిహారిక-చైతన్య పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, వీరి విడాకుల అంశంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా లైఫ్ కోచ్ అండ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ ప్రియా చౌదరి స్పందించింది.
‘‘వ్యక్తిగత విషయాల గురించి అదే పనిగా మాట్లాడడం సరికాదు. ఎంత సెలబ్రిటీ అయినా, కుమార్తె విషయంలో అందరి తండ్రుల మనసు ఒక్కటే. ఇలాంటి విషయాల్లో మెగాస్టార్ చిరంజీవి చాలా సెన్సిటివ్‌గా ఉంటారు.
ఈ సమయంలో ఆయనను ఇంకా గాయపరచకండి. ఎవరి పేరెంట్స్ అయినా తమ పిల్లల జీవితాలు ఇలా కావాలని కోరుకోరు. అనివార్య కారణాల వల్ల ఇలాంటివి జరుగుతాయి. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల వద్ద సహనం, ఓర్పు లాంటి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.’’ అంటూ వెల్లడించారు.
చిరంజీవి-సురేఖ దంపతుల్లా ఇద్దరి మధ్య అడ్జస్ట్‌మెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. వారినే ఎంతో మందికి బెస్ట్ ఉదాహరణగా చెప్పుకొవచ్చంటూ ఈ సందర్భంగా నిహారిక, చైతన్య డివోర్స్ గురించి దయచేసి అనవసరపు రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియా చౌదరి కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






