‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను సన్మానించిన మెగాస్టార్ చిరు

by Disha Web Desk 13 |
‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను సన్మానించిన మెగాస్టార్ చిరు
X

దిశ, సినిమా: రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఈసారి గ్రాండ్‌గా జరిగాయి. అలాగే సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో చరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు చాలామంది ప్రముఖులు వచ్చారు. ముఖ్యఅథులుగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ మొత్తం వచ్చింది. ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్ కీరవాణి, శ్రీవల్లి, రమా, కార్తికేయ, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్‌, డివివి దానయ్య, రాజమౌళి కుటుంబం మొత్తం హాజరయ్యారు. ఇక గౌరవనీయమైన ఆస్కార్ అకాడమీ అవార్డు గెలుచుకున్నవాళ్లకు పట్టు శాలువాలు, దండలు వేసి అభినందించారు చిరంజీవి. అలాగే ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న చిరు.. ‘రామ్ చరణ్ పుట్టినరోజున సన్నిహితుల సమక్షంలో మా ఆస్కార్ విజేతలను సన్మానించడం నిజమైన వేడుక! భారతీయ సినిమా కోసం తెలుగువారు సాధించిన ఈ ఘనత చరిత్రలో నిలిచిపోతుంది’ అని పేర్కొన్నారు.



Next Story

Most Viewed