చిరంజీవి మూవీలో ప్ర‌భాస్ హీరోయిన్ స్పెష‌ల్ రోల్ ?

by velandi.Saikiran |

చిరంజీవి మూవీలో ప్ర‌భాస్ హీరోయిన్ స్పెష‌ల్ రోల్ ? రాశి ఖ‌న్నాతో పాటు మాళవిక మోహనన్ కూడా నటించబోతున్నారట.

చిరంజీవి మూవీలో ప్ర‌భాస్ హీరోయిన్ స్పెష‌ల్ రోల్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, అందరికీ ఆదర్శంగా నిలిచాడు. చిరంజీవితో పాటు ఆయన కుటుంబం నుంచి కూడా చాలామంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు కచ్చితంగా చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

నవంబర్ 5వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బాబీ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రానున్న నేపథ్యంలో అందరి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రాశి ఖ‌న్నాతో పాటు మాళవిక మోహనన్ కూడా నటించబోతున్నారట. ఈ మేరకు చర్చ మొదలైంది. ఇందులో మాళవిక మోహనన్ ప్రత్యేక సాంగ్ లో కనిపిస్తారని కూడా అంటున్నారు. రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా ఉంటుందని, మాళవిక మోహనన్ రెండో హీరోయిన్ గా సినిమాలో మెరుస్తుందని సమాచారం.

Next Story