- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mega Star Chiranjeevi: మెగాస్టార్ ఆ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నారా?
by Phanindra |
ఆచార్య వంటి ప్లాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి

X
దిశ, వెబ్ డెస్క్ : ఆచార్య వంటి ప్లాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ సినిమా యావరేజ్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీసు వద్ద రికార్డ్స్ కలెక్షన్స్ వసూలు చేసింది. మెగాస్టార్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెగా స్టార్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల చాలా రోజులుగా మెగా స్టార్ కోసం వేచి చూస్తున్నారు. పూరీ జగన్నాద్ కూడా చిరు కోసం స్టోరీ రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ క్లారిటీ రావడం లేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం నెక్స్ట్ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ పి. యస్ మిత్రన్ చేయనున్నారని తెలుస్తుంది.
Next Story






