తల్లి కాబోతున్న మెగా డాటర్ నిహారిక?

by Dishanational2 |
తల్లి కాబోతున్న మెగా డాటర్ నిహారిక?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారికకు సంబంధించిన ఎన్నో రూమర్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య నిహారిక, చైతన్యతో విడాకులు తీసుకోబోతుందంటూ ఎన్నో వార్తలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. చైతన్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో నిహారిక ఫొటోలనే కాకుండా, పెళ్లి ఫొటోలను కూడా డిలీట్ చేయడంతో ఈ వార్త తెరమీదకు వచ్చింది. ఇక దీనిపై అటు నిహారిక కానీ, ఇటు చైతన్య కానీ స్పందించకపోవడంతో, నిజంగానే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ అందరూ భావిస్తున్నారు.

ఈ క్రమంలో మరో వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. అది ఏమిటంటే? నిహారిక తల్లికాబోతుందంట. తాజాగా నిహారిక తన సోషల్ మీడియా ఖాతాలో పుల్లటి మామిడికాయలు తింటున్న ఫొటో షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ ఏంటి నిహారిక నువ్వు తల్లి కాబోతున్నావా.. అందుకే అలా పుల్లటి మామిడికాయలు తింటున్నావా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more:

రామ్ చరణ్ కంటే వయసులో ఉపాసన ఎంత పెద్దదో తెలుసా?

Next Story

Most Viewed