షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా డాటర్.. రెండో పెళ్లి చేసుకోబోతుందా?

by Mallepaka Hamsa |

మెగా డాటర్ నిహారిక(Niharika Konidela ) మొదట యాంకర్‌గా బుల్లితెరకు పరిచయం అయి తన మాటలతో అందరినీ మెస్మరైజ్ చేసింది.

షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా డాటర్.. రెండో పెళ్లి చేసుకోబోతుందా?
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika Konidela ) మొదట యాంకర్‌గా బుల్లితెరకు పరిచయం అయి తన మాటలతో అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సైరా వంటి చిత్రాల్లో నటించింది. పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. ఈక్రమంలోనే ఆమెకు పెళ్లి కావడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయింది. కానీ ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. కొద్ది రోజులకే భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమిళంలో ఓ సినిమా చేసింది. కానీ హిట్ అందుకోలేకపోయింది.

ఈ అమ్మడు నిర్మాతగానూ మారి పింక్ ఎలిఫెంట్ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇక ఈ బ్యానర్‌లో వచ్చిన మొదటి మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’(Committee Kurrollu) బ్లాక్ హిట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. ప్రస్తుతం నిహారిక తన రెండో ప్రాజెక్ట్‌ను సంగీత్ శోభన్‌(Sangeet Shobhan)తో తీస్తోంది. ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న నిహారిక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తాజాగా, నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలు షేర్ చేసింది. ఇందులో రెడ్ అండ్ గ్రీన్ లైన్స్ పట్టుచీర కట్టుకుని నగలు ధరించింది. గులాబీ పువ్వును పాపిడ బిల్లగా పెట్టుకుని వెరైటీ లుక్‌తో కనిపించింది. ఆమె చుట్టూ పువ్వుల బుట్టలు ఉండగా.. నిహారిక పూలపై నిల్చొని ఫొటోకు పోజులిచ్చింది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘అన్ని శక్తులూ గర్జించాల్సిన అవసరం లేదు. కొంత బలం నిశ్శబ్దంలో ప్రవహిస్తుంది. పట్టు ధరించి ప్రశాంతతను పొందండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు అలాంటి గెటమ్‌లో దర్శనమిచ్చిందేంటి.. రెండో పెళ్లి చేసుకోబోతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story