- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Niharika: గుడ్ న్యూస్ ప్రకటించిన నిహారిక.. అతడితో ఉన్న వీడియో షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిహారిక(Niharika Konidela) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిహారిక(Niharika Konidela) అందరికీ సుపరిచితమే. మెగాబ్రదర్ నాగబాబు కూతురిగా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె పలు చిత్రాల్లో నటించింది. కానీ ఊహించినంత పాపులారిటీ మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో కొద్దికాలం పాటు సినిమాలకు దూరం అయింది. పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది. ఇక ఇటీవల మళ్లీ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్‌పై వచ్చిన ‘కమిటీ కోర్రోళ్ళు’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. ఇక ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది.
అంతేకాకుండా గద్దర్ అవార్డులు కూడా లభించిన విషయం తెలిసిందే. దీంతో జోరు పెంచిన నిహారిక ఇటీవల రెండో సినిమాపై అధికారిక ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది. తన రెండో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. సంగీత్ శోభన్(Sangeet Shobhan)తో పాటు తన రెండో ప్రాజెక్ట్‌లో నటిస్తున్న నటీనటులతో కలిసి ఉన్న ఫన్నీ వీడియోను నెట్టింట పెట్టింది. అలాగే ‘‘కన్ఫూజన్ ఏం లేదు. ఫన్నీ కాంబినేషన్‌లో కొత్త వైబ్స్‌తో, నవ్వులు పూయిస్తున్న ముఖాలతో మా మూవీ రాబోతుంది. వైల్డ్ రైడ్‌తో ప్రొడక్షన్-2 వస్తుంది’’ అని రాసుకొచ్చింది. త్వరలోనే యాక్షన్ స్టార్ చేయనున్నట్లు హింట్ ఇచ్చింది ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న రెండో ప్రాజెక్ట్ ‘ప్రొడక్షన్-2’ పేరుతో రాబోతుంది. ఇందులో మ్యాడ్, మ్యాడ్-2 వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించి ఫేమ్ తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నాడు. ఆయ్, క వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన నయన్ సారికా(Nayan Sarika) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. వెన్నెల కిశోర్(Vennela Kishore), బ్రహ్మాజీ, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, గెటప్ శ్రీను, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో కనిపించనున్నారు.ఫొటోలు






