బేబీబంప్‌తో వినాయకుడి పూజలు చేసిన మెగా కోడలు.. ఆ చిన్న విషయం కూడా తెలియదా అంటూ నెటిజన్ల ట్రోల్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

బేబీబంప్‌తో వినాయకుడి పూజలు చేసిన మెగా కోడలు.. ఆ చిన్న విషయం కూడా తెలియదా అంటూ నెటిజన్ల ట్రోల్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పలు చిత్రాల్లో నటించి కొద్ది రోజుల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించిన ఈ జంట 2023 జూన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో ఏడడుగులు వేశారు. ఇటలీలోని టస్కానీలో వీరి పెళ్లి జరగ్గా.. నవంబర్ 5న హైదరబాద్‌లో రిసెప్షన్ నిర్వహించగా.. సెలబ్రటీలంతా హాజరై సందడి చేశారు. అయితే వివాహం అనంతరం వరుణ్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక లావణ్య విషయానికొస్తే.. ఓ వెబ్ సిరీస్ చేసి దూరం అయింది. మళ్లీ ‘సతీ లీలావతి’ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తాను తల్లి కాబోతున్నట్లు మే 6న ప్రకటించింది.

దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అప్పటినుంచి లావణ్య సోషల్ మీడియాకు కూడా దూరం అయింది. నిత్యం తన భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా, వినాయక చవితి పండుగ కావడంతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫొటో షేర్ చేసింది. భర్తతో కలిసి వినాయకుడి విగ్రహం ముందు కూర్చొని దండం పెడుతూ మెగా కపుల్ కనిపించారు. ఇక ఇందులో బ్లూ కలర్ చుడీదార్‌లో కనిపించిన లావణ్య సింపుల్ లుక్‌తో అందరినీ ఫిదా అయ్యేలా చేస్తోంది. అలాగే ఈ ఫొటోలో ఆమె బేబీ బంప్ కనిపిస్తోంది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు వావ్, సూపర్, గార్జియస్ అని పొగడ్తలతో ముంచేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో ఇంట్లో వినాయకుడి పూజలు చేయకూడదని కూడా తెలియదా అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం కచ్చితంగా వచ్చే ఏడాది వరకి బుజ్జి వినాయకుడు పుడతాడని అంటున్నారు.

Next Story