- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Upasana: కష్టాల్లో మెగా కోడలు.. కఠిన నిర్ణయం తీసుకోవడంతో నెటిజన్లు షాక్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె సినిమాల్లో నటించనప్పటికీ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ పాపులారిటీని దక్కించుకుంది. నిత్యం నెట్టింట ఏదో ఒక పోస్ట్ పెడుతూ నెటిజన్లను ఆలోచింప చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఉపాసన(Upasana) కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ప్రతి ఒక్కరూ తమకు సరిపోయే ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనాలి. నా భర్తకు అది అయ్యప్ప స్వామి అంటే ఇష్టం. నాకు మాత్రం సాయిబాబా. చిన్నతనం నుండి నా తాతామామలకు, తల్లిదండ్రులకు దేవుడిపై అపారమైన నమ్మకం కలిగి ఉండడం చూశాను.
ఈ విశ్వాసం నాకు ఒక బలమైన ఆధారాన్ని అందించింది. నా జీవితంలో ఒక దశలో నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాను. నా మనసు కొంత కలవరపడింది. అప్పుడు నాకు కొంతమంది సాయిబాబా వ్రతాన్ని పాటించాలని సలహా ఇచ్చారు. సాయిబాబా కథను చదవడం ప్రారంభించినప్పుడు.. నా జీవితంలో మార్పులు మొదలయ్యాయి. నేను మరింత సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించాను. నా చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సానుకూలంగా మారడం గమనించాను. ఈ చిన్న చిన్న మార్పులు నన్ను మరింత మంచి వ్యక్తిగా మార్చాయని గ్రహించాను. అందుకే ఈ వ్రతం నాకు ఎంతో ప్రత్యేకం. మీరు జీవితంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లయితే, మీ పనులు సజావుగా సాగడం లేదనిపిస్తే, ఏదైనా వ్రతాన్ని పాటించడానికి ప్రయత్నించండి.
నేను నమ్మే ఒక విషయం ఏమిటంటే.. నమ్మకంగా ఉంటే ఎలాంటి కష్టం అయినా తీరుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉపాసనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ వ్రతం కఠినంగా ఉంటుందట. తొమ్మిది వారాల పాటు సాయిబాబ వ్రతాన్ని ఆచరించాలి. 9 గురువారాల మందిరానికి వెళ్లి ప్రార్థించాలి. వ్రతం పూర్తి అయ్యాక షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకోవాలి. అలాగే బీదలకు అన్నదానం చేయాలి. 5 లేదా 11 మందికి వ్రత పుస్తకాలను కూడా ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వ్రతాన్ని మెగా కోడలు పాటించడంతో నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.






