ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. వైరల్‌గా మారిన పోస్ట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది.

ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. వైరల్‌గా మారిన  పోస్ట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత మిస్టర్, అంతరిక్షం, బంగారాజు వంటి చిత్రాల్లో వరుణ్ తేజ్(Varun Tej) సరసన రొమాన్స్ చేసింది. ఈక్రమంలోనే వీరిద్దరు ప్రేమించుకున్నారు. కొద్ది కాలంపాటు లవ్‌లో ఎంజాయ్ చేసిన ఈ జంట పెద్దలను ఒప్పించి 2023లో నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. ఇక మెగా కోడలు అయ్యాక లావణ్య రేంజ్ మారిపోయింది. దీంతో మొత్తానికి ఇండస్ట్రీకి దూరంగా అయింది. ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఇంటికే పరిమితం అయింది. వివాహం అనంతరం ఓ వెబ్ సిరీస్‌ చేసింది.

ఆ తర్వాత ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi )సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, షూటింగ్‌లోనూ పాల్గొన్నది. అలాగే మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యాక తాను ప్రెగ్నెంట్ కాబోతున్నట్లు వెల్లడించి అందరికీ గుడ్ న్యూస్ తెలిపిందే. దీంతో ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇండస్ట్రీకి దూరం అవుతుందని ఫిక్స్ అయ్యారు. ఇక లావణ్య మాత్రం వరుణ్ తేజ్‌కు షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాకు కూడా దూరమైన ఈ భామ తనకు పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ కూడా చేయడం ప్రారంభించింది. అప్పుడప్పుడు పలు పోస్టులు ద్వారా తన బేబీ బంప్‌ను చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, లావణ్య త్రిపాఠి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. అది చూసిన వారంతా బిడ్డ పుట్టిందని అభిప్రాయ పడ్డారు. కానీ తను నటిస్తున్న ‘సతీ లీలావతి’ సినిమాకు సంబంధించిన టీజర్ ఈ నెల 29న 10:30 గంటలకు రాబోతున్నట్లు ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘లీల ప్రపంచంలోకి ఒక చిన్న చూపు. దారిలో ఉన్న పిచ్చితనం గురించి ఒక చిన్న చూపు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన లావణ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story