Jr Ntr:నాగబాబుపై ఎన్టీఆర్ ఫాన్స్ ఫైర్.. క్షమాపణలు చెప్పిన మెగా బ్రదర్

by Disha Web Desk 3 |
Jr Ntr:నాగబాబుపై ఎన్టీఆర్ ఫాన్స్ ఫైర్.. క్షమాపణలు చెప్పిన మెగా బ్రదర్
X

దిశ డైనమిక్ బ్యూరో: ఇటీవల వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగబాబు పోలీస్ పాత్రకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే బాగోదు అని మాట్లాడారు. ఇక నాగబాబు వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. దీనితో నాగబాబు జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించే ఇలా మాట్లాడారని జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ నాగబాబు పై ఫైర్ అవుతున్నారు.

ఇక ఎన్టీఆర్ అభిమానులు రంగప్రవేశం చేయడంతో చేసేదేమీ లేక ఈ రోజు ఉదయం ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలియచేసారు. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని.. ఆ మాటలు యాదృచ్చికంగా వచ్చాయని తెలిపారు. ఎవరైనా తన మాటలవల్ల నొచ్చుకుని ఉంటె క్షమించాలని కోరారు.

Read More..

jnr ఎన్టీఆర్ ఊతపదం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రోజులో అన్నిసార్లు అదే అంటాడా?


Next Story