- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న మీనాక్షి చౌదరి..యాక్షన్ స్టార్ సరసన బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా!
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) వరుస విజయాలతో క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) వరుస విజయాలతో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ చిత్రాలతో మీనాక్షి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అయిపోయింది. త్వరలోనే ఈ అమ్మడు ‘అనగనగా ఒకరాజు’ సినిమాతో రాబోతుంది. అలాగే నాగచైతన్య సరసన ‘NC-24’లో నటిస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, ఈ క్రేజీ భామ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు పలు వార్తలు జోరందుకున్నాయి. మీనాక్షి చౌదరి బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం సరసన ‘ఫోర్స్-3’(Force-3)చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.
భావ్ ధూలియా(Bhav Dhulia) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక మీనాక్షి లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఆమెను ఫైనల్ చేసినట్లు టాక్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం కోసం మీనాక్షికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వనున్నారట. ‘ఫోర్స్-3’ సినిమా షూటింగ్ నవంబర్‌లో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి తీసుకురావాలనే ప్లాన్‌లో మూవీ మేకర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మీనాక్షికి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో అమ్మడు రేంజ్ మారిపోవడం ఖాయమని అంటున్నారు.






