అక్కినేని హీరోతో అడ్డంగా దొరికిపోయిన మీనాక్షి చౌదరి.. సంచలనంగా మారిన వీడియో

by Mallepaka Hamsa |

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury), సుశాంత్(Sushanth) జంటగా నటించిన మూవీ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.

అక్కినేని హీరోతో అడ్డంగా దొరికిపోయిన మీనాక్షి చౌదరి.. సంచలనంగా మారిన వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury), సుశాంత్(Sushanth) జంటగా నటించిన మూవీ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ సినిమాతోనే మీనాక్షి ఇండస్ట్రీకి వచ్చింది. 2021లో వచ్చి హిట్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ అమ్మడు నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఆమె వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల ‘సంక్రాంతి వస్తున్నాం’మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. గత కొద్ది కాలంగా మీనాక్షి చౌదరి, సుశాంత్ డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ నిత్యం పలు పుకార్లు షికారు చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ ఈ లవ్ బర్డ్స్ స్పందించకపోవడంతో నిత్యం వీరి గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఈక్రమంలో.. తాజాగా, మీనాక్షి చౌదరి, సుశాంత్ ఎయిర్ పోర్ట్‌లో జంటగా కనిపించడంతో ఈ వీడియో కాస్త సంచలనం సృష్టిస్తోంది. వీరిద్దరు కలిసి గామా అవార్డు వేడుకలకు కలిసి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు అయితే డేటింగ్ పుకార్లు నిజమే అన్నమాట అందుకే కలిసి వెళ్తున్నారని అంటున్నారు. అలాగే వీరిపై వస్తున్న వార్తలకు ఈ వీడియోతో బలం చేకూరినట్లు అయింది.

Next Story