విల‌న్ పాత్ర‌లో టాలీవుడ్ హీరోయిన్‌..ఇక ర‌చ్చ ర‌చ్చే !

by velandi.Saikiran |   (  Updated:2025-09-28 13:02:48  IST  )

బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేందుకు మీనాక్షి చౌదరి సిద్ధమైనట్లు చెబుతున్నారు. త‌న సెకండ్ సినిమాలో విల‌న్ పాత్ర ఆఫ‌ర్

విల‌న్ పాత్ర‌లో టాలీవుడ్ హీరోయిన్‌..ఇక ర‌చ్చ ర‌చ్చే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది హీరోయిన్లు ఒకటి లేదా రెండు సినిమాలతోనే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) ఒకరు. ఈ పొడుగు కాళ్ళ సుందరి... హర్యానా నుంచి వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ బ్యూటీ... గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బంపర్ హిట్ సినిమాలు అందుకున్నారు.

దీంతో తెలుగులో మరిన్ని అవకాశాలు ఆమెకు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా ఆమె వెళ్తున్నారు. ప్రస్తుతం ఫోర్స్ 3 సినిమాలో మీనాక్షి చౌదరి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ సినిమా తర్వాత... మరో సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేందుకు మీనాక్షి చౌదరి సిద్ధమైనట్లు చెబుతున్నారు. బాలీవుడ్ లో త‌న సెకండ్ సినిమాలో విల‌న్ పాత్ర ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఈ మేర‌కు ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. ఆ నెగిటివ్ పాత్ర చేస్తే.. మీనాక్షి చౌద‌రి కెరీర్ ఓ రేంజ్ కు వెళుతుంద‌ట‌. ఈ సినిమాపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌.

Next Story