- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూట్ మార్చిన మేధా శంకర్.. ఎప్పుడూ అలాంటి పాత్రలు చేస్తే కిక్కు ఏముంటుందంటూ సెన్సేషనల్ కామెంట్స్
గిన్నీ పాత్ర చాలా చురుకైనది, అలాగే కాస్త అసహనంతో కూడినది. ‘12th ఫెయిల్’లోని శ్రద్ధా పాత్రను ప్రేక్షకులు ఎలాగైతే ప్రేమించారో, గిన్నీని కూడా అంతే ఆదరిస్తారని నమ్ముతున్నాను

దిశ, సినిమా: బాలీవుడ్ సెన్సేషన్ మేధా శంకర్ ‘12th ఫెయిల్’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో తన సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకుంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలోనే కొద్దిరోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మేధా, ఇప్పుడు సరికొత్త గ్లామర్ లుక్‌తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఒకప్పుడు ‘పక్కింటి అమ్మాయి’గా మెప్పించిన ఈ బ్యూటీ, ఇప్పుడు గ్లామర్ సిటీ గర్ల్‌గా రూటు మార్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మేధా శంకర్ ‘గిన్నీ వెడ్స్ సన్నీ-2’ చిత్రంతో బిజీగా ఉంది. ఇందులో యువ హీరో అవినాష్ తివారీతో కలిసి రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో ఆమె ‘గిన్నీ’ అనే సిటీ అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. పెళ్లి కోసం అబద్ధాలు ఆడే ఒక ఆసక్తికరమైన క్యారెక్టర్‌లో మేధా తన నటనతో అదరగొట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో..తాాజాగా, ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, పాత్రల ఎంపికపై మేధా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. "గిన్నీ పాత్ర చాలా చురుకైనది, అలాగే కాస్త అసహనంతో కూడినది. ‘12th ఫెయిల్’లోని శ్రద్ధా పాత్రను ప్రేక్షకులు ఎలాగైతే ప్రేమించారో, గిన్నీని కూడా అంతే ఆదరిస్తారని నమ్ముతున్నాను.
నటిగా నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలంటే ఇటువంటి వైవిధ్యమైన పాత్రలు తప్పనిసరి. ‘పక్కింటి అమ్మాయి’ ఇమేజ్ నుండి బయటకు రావాలని నేను అనుకున్న మాట వాస్తవం. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేస్తే అందులో కిక్కు ఏముంటుంది? కష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే నటిగా నిజమైన తృప్తి దొరుకుతుంది" అని తన మనసులో మాటను బయటపెట్టింది. ప్రశాంత్ ఝూ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, 2020లో విడుదలైన ‘గిన్నీ వెడ్స్ సన్నీ’కి సీక్వెల్‌గా రాబోతోంది. సుధీప్ పాండే, లిలెట్ ధూబే, గోవింద్ నామ్ దేవ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మేధా శంకర్ కొత్త గ్లామర్ లుక్, ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. తన ఇమేజ్‌ను చెరిపేసుకుని ఒక కమర్షియల్ హీరోయిన్‌గా ఎదగాలని చూస్తున్న మేధా శంకర్ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.






