సైలెన్స్ వెనుక భారీ ప్లానింగ్.. ఏకంగా 4 సినిమాలతో రాబోతున్న కిచ్చా సుదీప్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-26 14:32:31  IST  )

ఈ ఏడాది సుదీప్ ఒకేసారి ఏకంగా నాలుగు కొత్త సినిమాలను అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ నాలుగు చిత్రాలు ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట

సైలెన్స్ వెనుక భారీ ప్లానింగ్.. ఏకంగా 4 సినిమాలతో రాబోతున్న కిచ్చా సుదీప్!
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గత ఏడాది ‘మార్క్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత నుంచి సుదీప్ సైలెంట్‌గా ఉండిపోవడంతో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, కిచ్చా సుదీప్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సుదీప్ తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత భారీ ప్లానింగ్ చేస్తున్నాడట. అభిమానులకు అదిరిపోయే లైనప్‌ను సర్ప్రైజ్‌గా ఇవ్వడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సుదీప్ ఒకేసారి ఏకంగా నాలుగు కొత్త సినిమాలను అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ నాలుగు చిత్రాలు ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. ఒక్కో సినిమా ఒక్కో విభిన్నమైన జానర్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. వీటన్నిటిలోకి హైలైట్ ఏంటంటే.. ఈ నాలుగు చిత్రాల్లో ఒక దానికి సుదీప్ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014లో వచ్చిన ‘మాణిక్య’ సినిమా తర్వాత సుదీప్ మళ్లీ డైరెక్టర్ సీట్లో కూర్చోలేదు.

దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పడుతుండటంతో కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మూవీస్‌తో పాటు సుదీప్ రాబోయే సినిమాల్లో అన్నిటికంటే పెద్ద ప్రాజెక్ట్ ‘బిల్లా రంగ బాషా’. గతంలో మంచి విజయం సాధించిన ‘విక్రాంత్ రోణ’ సినిమా తర్వాత దర్శకుడు అనూప్ భండారి, సుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న రెండవ ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉండబోతోందట. భవిష్యత్తు కాలం నాటి.. అంటే క్రీ.శ. 2209 బ్యాక్‌డ్రాప్‌లో, నెక్స్ట్ లెవెల్ విజువల్స్‌తో ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని చాలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. ఈ జూన్ నెల నుంచే సుదీప్ మళ్లీ ‘బిల్లా రంగ బాషా’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట.

Next Story