అభిమానులకు మాస్ విందు.. అంచనాలను పెంచుతున్న ‘మాస్ జాతర’ ట్రైలర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 16:02:11  IST  )

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జాతర’(mass jathara) సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది.

అభిమానులకు మాస్ విందు.. అంచనాలను పెంచుతున్న ‘మాస్ జాతర’ ట్రైలర్
X

దిశ, సినిమా: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జాతర’(mass jathara) సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ (raviteja)నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ విందులా ఈ ట్రైలర్ ఉంది. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం ‘మాస్ జాతర’ ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్‌ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్‌ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. నవీన్ (navven chandra) మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు. దీనికి తోడు మరింత ఆకర్షణగా శ్రీలీల తెరపై ఎంతో అందంగా కనిపించారు. ఆమె మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడినప్పటికీ, ఆ యాసను పూర్తిగా ఆస్వాదిస్తూ అద్భుతంగా పలికిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ ట్రైలర్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Next Story