- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన మారుతి.. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటూ ఎమోషనల్ ట్వీట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి (Maruthi)కాంబోలో రాబోతున్న మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి (Maruthi)కాంబోలో రాబోతున్న మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా రాబోతుండటంతో మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా, ‘ది రాజా సాబ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ లాంచ్ వేడుకల్లో పాల్గొన్న మారుతి వివాదాస్పద కామెంట్లు చేసి చిక్కుల్లో పడ్డారు. ‘‘కాలర్ ఎగరేసుకుంటారని నేను చెప్పను ఎందుకంటే ప్రభాస్ కటౌట్ ముందు ఆ మాటలు చిన్నవి అవుతాయి’’ అని అన్నారు. ఇవి కాస్త వైరల్ కావడంతో ‘వార్-2’ ఈవెంట్ ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి డిజాస్టర్ అందుకున్నందుకే అన్నారని ఎన్టీఆర్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా మారుతిని దారుణంగా తిడుతున్నారు. తాజాగా, ఈ వివాదంపై మారుతి క్లారిటీ ఇస్తూ తారక్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
‘‘నేను నా కామెంట్స్‌పై వివరణ ఇవ్వానుకుంటున్నాను. ముందుగా ప్రతి అభిమానికి నా క్షమాపణలు తెలిజేస్తున్నాను. ఉద్దేశపూర్వకంగా నేను ఎవ్వరినీ బాధపెట్టాలని కానీ అగౌరవ పరచాలని ఆ కామెంట్స్ చేయలేదు. స్టేజ్‌పై మాట్లాడే సమయంలో ఒక్కోసారి ఇలాంటి మాటలు దొర్లుతుంటాయి. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా కామెంట్స్ ఇలా ప్రజల్లోకి వెళ్లినందుకు బాధగా ఉంది. నాకు ఎన్టీఆర్ అభిమానులంటే చాలా ఇష్టం. వారిని గౌరవిస్తాను. ప్రతి అభిమాని సినిమాలకు ఇచ్చే విలువను చూసి నేను చాలా సంతోషిస్తాను. నేను ఆయనను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదు.. దయచేసి నన్ను అర్థం చేసుకోండి’’ అని రాసుకొచ్చారు. దీంతో వివాదం కాస్త సర్దుమనగడంతొ ట్రోలింగ్‌కు కాస్త చెక్ పడింది.






