కాలెండర్‌లో మార్క్ చేసుకోండి.. ‘తలైవాన్.. తలైవీ’ సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చిన నిత్యామీనన్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-29 09:05:31  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.

కాలెండర్‌లో మార్క్ చేసుకోండి.. ‘తలైవాన్.. తలైవీ’ సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చిన నిత్యామీనన్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా తన నటనతో స్పెషల్ ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. దీంతోపాటు విజయ్ సేతుపతి, పాండిరాజ్(Pandiraj) కాంబోలో ‘తలైవాన్.. తలైవీ’ (Thalaivan Thalaivii)మూవీ రాబోతుంది. అయితే ఇందులో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మొదటి సారి విజయ్, నిత్యా కాంబోలో రాబోతుండటంతో వీరి కెమిస్ట్రీ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రగ్గడ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి, త్యాగరాజన్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, చిత్రబృందం ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మీ కాలెండర్‌లో మార్క్ చేసుకోండి.. తలైవాన్.. తలైవీ జూలై 25న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు నిత్యామీనన్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. ఇక టీజర్‌లో వెల్‌కమ్ టూ రాఘవర్తిని అని విజయ్ సేతుపతి వంటలు చేస్తూ కనిపిస్తాడు. దానిని నిత్యామీనన్ టేస్ట్ చేసి రుచి గురించి భర్తకు చెప్తుంది. ఇక ఈ హోటల్‌కు ఎంతోమంది కస్టమర్స్ వచ్చి లోట్టలేసుకుంటూ ఆహారాన్ని తింటుంటారు.. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ హోటల్ లాభాల బాట పట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story