టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరాఠీ భామ.. మొదటి సినిమా ఏ హీరోతో నటించనుందంటే?

by Mallepaka Hamsa |

మరాఠీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యశశ్రీ రావు(Yashashree rao) హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరాఠీ భామ.. మొదటి సినిమా ఏ హీరోతో నటించనుందంటే?
X

దిశ, సినిమా: మరాఠీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ యశశ్రీ రావు(Yashashree rao) హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. నెట్టింట ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ నటనపై ఆసక్తితో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాను 90s కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఈటీవీ విన్‌తో కలిసి నిర్మిస్తున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇక ఈ కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు హాజరు కాగా.. నిర్మాత రవిశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. హరీష్ శంకర్ (Harish Shankar)ఫస్ట్ క్లాప్ కొట్టారు.

ఈ వేడుకల్లో బన్నీ వాస్, ప్రసాద్, నికిల కోనేరు, మెహర్ రమేష్ పాల్గొన్నారు. ఈ సినిమా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. చంద్ర నాయుడు నిర్మాణంలో రాబోతుంది. ఇక ఇందులో హీరోగా ‘బేబీ’ ఫేమ్ విరాజ్ అశ్విన్(Viraj Ashwin) హీరోగా నటిస్తుండగా.. యశశ్రీ రావు, ప్రియ దర్శిని రావు, పవన్ సిద్ధు, టేస్టీ తేజ, సూర్య గోపీనాథ్, బాబు మోహన్, శివన్నారాయణ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అవి చూసిన నెటిజన్లు యశశ్రీ రావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story