- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాలామంది ఆడవాళ్ళు మొగుళ్ళను వదిలేస్తున్నారు.. సందీప్ మాస్టర్ భార్య సెన్సేషనల్ కామెంట్స్
కొరియోగ్రాఫర్ ఆట సందీప్(Sandeep) భార్య జ్యోతి రాజ్(Jyoti Raj) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: కొరియోగ్రాఫర్ ఆట సందీప్(Sandeep) భార్య జ్యోతి రాజ్(Jyoti Raj) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయనతో పలు పాటలకు డ్యాన్స్ చేసి బెస్ట్ వైఫ్ అనిపించుకుంది. అంతేకాకుండా వీరిద్దరు కలిసి పలు షోస్‌లోనూ పాల్గొన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు వీడియోలు షేర్ చేస్తోంది. ఇక ఇటీవల విడాకులపై ఆమె చేసిన వీడియో వివాదాస్పదమయ్యాయి. తాజాగా, జ్యోతిరాజ్ మరో సెన్సేషనల్ వీడియోను షేర్ చేసింది. ‘‘మొన్న నేను చేసిన వీడియోకు బాగా రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది నాకు కాల్ కూడా చేశారు. కొందరు మాత్రం మనోభావాలు దెబ్బతిన్నాయని ఘాటుగా స్పందిస్తున్నారు. దయచేసి మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు.
చాలామంది మొగుళ్లను వదిలేస్తున్నారు. అలా అని చెప్పి మగవాళ్లందరు సుద్దపూసలని నేను చెప్పట్లేదు. ఇప్పటికీ ఆడవాళ్లలో బంగారు తల్లులు, బంగారు పెళ్లాలు ఉన్నారు. ఫ్యామిలీ, పిల్లల కోసం చదివిన చదువులను కూడా త్యాగం చేసినవాళ్లు ఉన్నారు. నేను అలాంటి వారి గురించి మాట్లాడట్లేదు. మనల్ని కన్న తల్లిదండ్రులు కష్టపడి పెంచితే.. చిన్న చిన్న కారణాలతో విడిపోయి ఇంట్లో ఉంటే వాళ్లు బాధపడతారు. ఎంతోమందిని చూసిన తర్వాత నేను ఆ వీడియో చేశా. దానికి మీరు ఏదేదో ఊహించుకుని నా మనసులో ఏదో బాధ ఉందని చెప్పడం కరెక్ట్ కాదు.
నేను ఈ ప్రపంచంలోనే మోస్ట్ లక్కీయస్ట్ వైఫ్‌ను. మా ఆయనకు నేనంటే పిచ్చి.. మా ఆయనంటే నాకు పిచ్చి.. మేమలా ఫిక్సయ్యాం. తగ్గాలంటే చేతులు కట్టుకుని నిలబడాలని కాదు. ఇద్దరు అండర్‌స్టాండింగ్‌గా ఉండాలి. అదే నా ఇంటెన్షన్ కాదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి’’ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు సూపర్ అక్కా అని కామెంట్లు చేస్తున్నారు.






