Kaikala Satyanarayana మృతి.. KCR, ChandraBabu సహా ప్రముఖుల సంతాపం

by Sathputhe Rajesh |   (  Updated:2022-12-23 06:21:33  IST  )

తన నటనా ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమకు 60 ఏళ్ల పాటు సేవలందించిన కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

Kaikala Satyanarayana మృతి.. KCR, ChandraBabu సహా ప్రముఖుల సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: తన నటనా ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమకు 60 ఏళ్ల పాటు సేవలందించిన కైకాల సత్యనారాయణ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ మరణం టాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. 1935 జూలై 25న జన్మించిన ఆయన నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. సిపాయి కూతురు తో తొలిసారి వెండితెరపై కనిపించారు. పౌరాణికం, జానపదం, కమర్షియల్ సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా అలరించారు.


2019లో చివరిసారిగా మహర్షి సినిమాలో నటించారు. కాగా ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మహేష్ బాబు, రామ్ చరణ్, రవితేజ, నాని, శర్వానంద్, నందమూరి కల్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్, శ్రీకాంత్, నిర్మాత బండ్ల గణేష్, నారా లోకేష్, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల, బాబీ, మారుతి, అనిల్ రావిపూడి, అనసూయ, కోనా వెంకట్, బీవీఎస్ రవి ట్విట్టర్ వేదికగా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

Next Story