సవాళ్లు ఎదుర్కోవడమంటే చాలా ఇష్టం.. మిస్ వరల్డ్

by Dishanational2 |
సవాళ్లు ఎదుర్కోవడమంటే చాలా ఇష్టం.. మిస్ వరల్డ్
X

దిశ, సినిమా: మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ 'పృథ్వీరాజ్' సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. అక్షయ్ కుమార్ హీరోగా చహమనా వంశానికి చెందిన రాజ్‌పుత్ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో యువరాణి సంయోగిత పాత్రను పోషించింది. అయితే జూన్ 3న విడుదల కాబోతున్న మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఆమె.. ఎదుగుతున్న క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఇష్టపడతానని చెప్పింది. అలాగే అనుభవజ్ఞులైన సీనియర్ నటులతో పని చేస్తున్నపుడు బాధ్యతగా నడుచుకోవాలన్న నటి.. అక్షయ్‌తో వర్క్ చేయడం చాలా స్మార్ట్‌‌ అండ్ సింపుల్‌గా అనిపించడమే కాదు భిన్నమైన అనుభవాన్ని ఇస్తుందని తెలిపింది. ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన హిస్టారికల్ డ్రామాకు చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించగా.. సంజయ్ దత్, సోనూ సూద్, మానవ్ విజ్, అశుతోష్ రానా, సాక్షి తన్వర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



Next Story

Most Viewed