మాకు మతం కంటే విలువలే ముఖ్యమైనవి.. మనోజ్

by Disha Web Desk 10 |
మాకు మతం కంటే విలువలే ముఖ్యమైనవి.. మనోజ్
X

దిశ, సినిమా: మనుషుల మధ్య మతాలకంటే విలువలే ముఖ్యమైనవి అంటున్నాడు నటుడు మనోజ్ బాజ్‌పేయి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను.. ‘ఒక హిందువు అయిన మీరు.. ముస్లిం మహిళ షబానా రజాను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? వేరు వేరు మతాలు కావడం వల్ల మీ మధ్య గొడవలు అవుతున్నాయా?’ అనే ప్రశ్నకు తెలివిగా బదులిచ్చాడు. ‘షబానాతో నా వివాహం మతం కంటే విలువలకు సంబంధించినది. భవిష్యత్తులో ఎవరైనా తమ విలువలను మార్చుకున్నా.. వారి బంధం ఎక్కువ కాలం కొనసాగదు. నేను బ్రాహ్మిణ్, ఆమె ముస్లిం. అయినా మా వివాహానికి ఏది అడ్డు రాలేదు. నా భార్యకు ప్రత్యేకించి మతం లేదు చాలా స్పిరిచ్యువల్. ఆమె ముస్లింగా, నేను హిందువుగా గర్విస్తాము. ఎప్పుడూ మతం విషయంలో ఘర్షణ పడలేదు’ అని స్పష్టం చేశాడు. మనోజ్ త్వరలోనే ‘ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.



Next Story

Most Viewed