Manisha Rani : ఇంట్లోనుంచి పారిపోయిన మనీషా.. హోటల్లో ఆ పనిచేస్తూ

by Dishaweb |
Manisha Rani : ఇంట్లోనుంచి పారిపోయిన మనీషా.. హోటల్లో ఆ పనిచేస్తూ
X

దిశ,సినిమా: ‘బిగ్ బాస్’ ఓటీటీ2 కంటెస్టెంట్ మనీషా రాణి.. యుక్త వయసులో తను చేసిన ఓ భయంకరమైన పని గురించి ఓపెన్ అయింది. ఈ మేరకు కంటెంట్ క్రియేటర్, డ్యాన్సర్‌గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఆమె.. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చూసి తట్టుకోలేక చదువు ఆపేసి ఏదో ఒక పని చేయాలనే ఆలోచనలతో కొద్దిరోజులు ఘర్షణ పడ్డానని చెప్పింది. ఈ క్రమంలోనే చివరికి ఇంటి నుంచి పారిపోయి వెయిట్రెస్‌గా పనిచేసినట్లు చెప్పిన మనీషా.. ఉద్యోగంలో చేరిన తర్వాత విభిన్న కష్టాలు ఎదురయ్యాయని తెలిపింది. ‘తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి 8 గంటలు పాటు నిలబడి పనిచేసేదాన్ని. ఆకలైనపుడు మా ముందు ఫ్యాన్సీ ఫుడ్ ఉన్నా.. తినడానికి అనుమతించరు. దాన్ని చూస్తూ ఉండిపోవడమే తప్పా ఒక ముక్క ముట్టే పరిస్థితి ఉండదు. కళ్లముందు రుచికరమైన ఆహారం పెట్టుకుని గంటలకొద్ది నిలబడి చూస్తూ ఉండిపోవడంలో ఉన్న బాధ మాటల్లో వర్ణించలేనిది. పెదరికం కారణంగా జీవితంలో ఇలాంటి ఫుడ్ ఒక్కసారైనా తినాలని కోరుకునేదాన్ని. ఆ కల నిజం చేసుకోలేపోతానేమోనని బాధపడేదాన్ని’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.

Bigg Boss OTT season 2: Manisha Rani reveals she ran from home, worked as a waitress and background డాన్స్

Ram Gopal Varma : అప్సర రాణి బికినీ ఫోటోలను షేర్ చేసిన ఆర్జీవీ


Next Story

Most Viewed