రజనీతో ఆ సినిమా చేయడం వల్లే నా కెరీర్‌ క్లోజ్ అయింది: మనీషా

by Disha Web Desk 13 |
రజనీతో ఆ సినిమా చేయడం వల్లే నా కెరీర్‌ క్లోజ్ అయింది: మనీషా
X

దిశ, సినిమా: రజనీకాంత్ ‘బాబా’ సినిమాపై ప్రముఖ నటి మనీషా కోయిరాల షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ మూవీలో నటించడం వల్లే తన కెరీర్ ప్రమాదంలో పడిందంటూ రీసెంట్ ఇంటర్య్వూలో వెల్లడించింది. 2002లో తెలుగులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో దక్షిణాది సినీపరిశ్రమలో తన కెరీర్ ముగిసిందని భావించానన్న నటి.. ‘ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు ఉండే.

కానీ, ఊహించని విధంగా ఫ్లాప్ అవ్వడంతో నాకు ఆఫర్లు రాలేదు. ‘బాబా’ నా సౌత్ కెరీర్‌పై చాలా ప్రభావం చూపింది. బహుశా నా చివరి పెద్ద తమిళ చిత్రం ‘బాబా’నే కావొచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ మూవీ పరాజయంతో రజనీకాంత్ డిస్ట్రిబ్యూటర్‌లకు నష్టాలను తిరిగి చెల్లించాడు. కాగా 2022లో రీరిలీజ్ అయిన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టడం విశేషం.


Next Story

Most Viewed