తెలుగు ఇండస్ట్రీ ఘనకీర్తిని చాటిచెబుదాం.. ‘మా’ అధ్యక్షుడు మంచువిష్ణు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
తెలుగు ఇండస్ట్రీ ఘనకీర్తిని చాటిచెబుదాం.. ‘మా’ అధ్యక్షుడు మంచువిష్ణు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ‘మా’ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని ‘మా’ అధ్యక్షుడు మంచువిష్ణు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మంచువిష్ణు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వచ్చే జులై నెలలో మలేషియా వేదికగా ఈ మహా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి వేడుకల తేదీని నిర్ణయిస్తామని అన్నారు.

జులై నెలల మూడు రోజుల పాటు షూటింగ్స్‌కు సెలవు ఇవ్వాలని ఇప్పటికే నిర్మాతల మండలిని కోరినట్లు తెలిపారు. సెలవులపై ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. దేశంలోని 5 అసోసియేషన్లతో ‘మా’ ఒప్పందం చేసుకుందని చెప్పారు. 90 ఏళ్ల తెలుగు చిత్ర పరిశ్రమ ఘనకీర్తిని చాటిచెప్పేందుకే ఈ వేడుకలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషన్ పురస్కారం రావడం గొప్ప విషయం, మనందరం గర్వించాల్సిన సమయం అని అన్నారు.

Read More..

చిరంజీవిని ఓడించా.. పవన్ కల్యాణ్‌ను ఓడిస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు



Next Story

Most Viewed