రెండు రోజుల్లో ‘కన్నప్ప’ విడుదల.. నా ప్రయాణం ముగింపునకు చేరుకుందంటూ మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్‌

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-25 10:06:21  IST  )

టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) 12 జ్యోతిర్లింగాల దర్శన యాత్రను చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

రెండు రోజుల్లో ‘కన్నప్ప’ విడుదల.. నా ప్రయాణం ముగింపునకు చేరుకుందంటూ మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్‌
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) 12 జ్యోతిర్లింగాల దర్శన యాత్రను చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ‘కన్నప్ప’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కోక్కటి దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే ప్రయాణం శాశ్వతమైన శాంతి. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పవిత్ర దర్శనం ఇప్పుడే పూర్తి చేసుకున్నాను - ఇది శివుని పన్నెండు గౌరవనీయమైన జ్యోతిర్లింగాలలో ఒకటి.

ఈ సందర్శనతో, పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలకు నా ప్రయాణం దైవిక ముగింపుకు చేరుకుంది. నా హృదయం నిండిపోయింది. నా ఆత్మ ధన్యమైనట్లు అనిపిస్తుంది. ప్రస్తుత జీవితం సానుకూలత, కృతజ్ఞత మరియు శాంతితో నిండి ఉంది. నేను ఈ ఆధ్యాత్మిక మైలురాయి అంచున నిలబడి ఉన్నప్పుడు జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే తదుపరి ‘కన్నప్ప’ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం. ఈ రోజు నేను మోసుకెళ్ళే స్ఫూర్తిని ప్రతిబింబించే కథ’’ అని రాసుకొచ్చారు.

అలాగే ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇక అది చూసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న చిత్రమే ‘కన్నప్ప’(Kannappa). ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇందులో విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Next Story