బంపర్ ఆఫర్ ప్రకటించిన మంచు విష్ణు.. నాకు మెసేజ్ చేయండి ఫ్రీగా పంపుతానంటూ (వీడియో)

by Disha Web Desk 6 |
బంపర్ ఆఫర్ ప్రకటించిన మంచు విష్ణు.. నాకు మెసేజ్ చేయండి ఫ్రీగా పంపుతానంటూ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు తనయుడిగా మంచు విష్ణు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ కొంతకాలంగా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై పలు అప్డేట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అయితే కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ఊహించని రెస్పాన్స్‌ను అందుకుంది. ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో పలువురు స్టార్ హీరోలు కూడా నటిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో కన్నప్పలో తన లుక్‌కు వచ్చిన స్పందనపై స్పందించడంతో పాటుగా సినీ ప్రియులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించాడు. ‘‘కన్నప్పలో నా ఫస్ట్ లుక్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను చూసి చాలా ఆనందంగా అనిపించింది. ఈ పోస్టర్‌ రిలీజ్‌కు ముందు చాలా భయపడిపోయాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలాంటి రోల్ చేయలేదు. అంతా ఈశ్వరేచ్ఛ.. ఆయన ఆశీర్వాదాలు ఉండటం వల్లే కన్నప్ప మూవీ చేయగలుగుతున్నాను. కన్నప్ప హిస్టరీ గురించి చాలా మంది అడుగుతున్నారు. కన్నడ, తెలుగు వారే కాకుండా తమిళం మలయాళం వాళ్లు కూడా కొన్ని ప్రశ్నలు నన్ను అడిగారు. ఇక నార్త్ నుంచి అయితే లెక్క లేనన్ని ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్లకి కన్నప్ప గురించి తెలియదు. ఇది నాకు బ్లెస్సింగ్ అనుకుంటున్నాను. అయితే కన్నప్ప గురించి శ్రీకాళహస్తి స్టోరీ గురించి చెప్పే అవకాశం నాకు దక్కింది.

అయితే కన్నప్ప గురించి ఇంత మందికి ఒక్కొక్కరికి సమాధానాలు చెప్పాలంటే చాలా కష్టం. కాబట్టి నేను మార్చి 19న కన్నప్ప మీద ఓ కామిక్ బుక్ లాంచ్ చేయబోతున్నాను. ఈ రోజు ఫస్ట్ వాల్యూమ్ రిలీజ్ చేస్తాను. కేవలం లిమిటెడ్ ఎడిషన్ రాబోతుంది. అదే రోజు నా హీరో పుట్టినరోజు.. నా ఫాదర్ మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా కన్నప్ప స్టోరీ బుక్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ స్టోరీ బుక్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. కన్నప్ప బుక్‌ను కొరియర్ ద్వారా ఫ్రీగా పంపిస్తాను. అలాగే వాట్సప్ ద్వారా డీటెయిల్స్ పంపండి. మీరు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ కన్నప్ప గురించి తెలియజేయడం నా భాధ్యతగా తీసుకుంటున్నాను. నేను చాలా ఎక్జైటింగ్‌గా ఫీలవుతున్నాను. కన్నప్ప సినిమా రిలీజ్ కోసం. లాట్స్ ఆఫ్ లవ్ మరోసారి అందరికీ థాంక్స్’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మంచు విష్ణు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

హీరో అయ్యాక నానిలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు.. ‘రజాకార్’ దర్శకుడు వైరల్ కామెంట్స్..




Next Story

Most Viewed