ఆటోకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మంచు మనోజ్.. అసలేం జరిగిందంటే? (వీడియో)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌(Manchu Manoj)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆటోకు కూడా డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో మంచు మనోజ్.. అసలేం జరిగిందంటే? (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌(Manchu Manoj)కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు లగ్జరీ కార్లు, భారీ భద్రతతో కనిపిస్తుంటే.. మనోజ్ మాత్రం భార్య భూమా మౌనిక(Bhooma Mounika)తో కలిసి ఆటోలో ప్రయాణం చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియోను స్వయంగా మంచు మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. జర్కిన్ ధరించి, కూలింగ్ గ్లాసెస్‌తో కనిపించిన మనోజ్ పక్కనే ఆయన భార్య మౌనిక కూడా ఉంది. వీడియోలో మాట్లాడుతూ.. “నేను నా భార్యతో కలిసి కారులో జిమ్‌కి వస్తుంటే కారు బ్రేక్‌డౌన్ అయింది. అందుకే ఆటో పట్టుకుని జిమ్‌కి వచ్చేశాం.

చలిలో జిమ్ మిస్ అవ్వకూడదు. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండటం కోసమే మార్నింగ్ జిమ్‌కు వచ్చేశాం. కాకపోతే ఆటోకి డబ్బులు లేవు.. మేనేజ్ చేస్తాం” అంటూ సరదాగా చెప్పాడు.ఈ వీడియోకి ఆయన పెట్టిన క్యాప్షన్ మరింతగా ఆకట్టుకుంది. “కారు ఈరోజు కుదరదు అన్నప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ ఎక్కేయ్ అంటుంది. లైఫ్ హపెన్స్… లవ్ కీప్స్ రోలింగ్. జీవితంలో అనుకోనివి జరుగుతుంటాయి. కానీ ప్రేమ మాత్రం సాగిపోతూనే ఉంటుంది” అంటూ తన స్టైల్‌లో భావోద్వేగాన్ని జత చేశాడు. ఇక అది చూసిన నెటిజన్లు.. స్టార్ హీరో అయినా సరే.. లైఫ్‌లో అనుకోనివి వచ్చినప్పుడు సింపుల్‌గా తీసుకోవడమే నిజమైన హీరో లక్షణం అని, ఈ ఆటో వీడియోతో మంచు మనోజ్ మరోసారి నిరూపించాడని నెటిజన్లు అంటున్నారు.

ఇంకొందరు మాత్రం “రీల్ హీరో కాదు.. రియల్ హీరో, కామన్ మ్యాన్ మనోజ్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం “ఇంత సింపుల్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నావేంటి? ఆస్తులన్నీ విష్ణు అన్న తీసుకున్నాడా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే..చాలా కాలం గ్యాప్ తర్వాత ‘భైరవం’తో రీఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘మిరాయ్’ కూడా ఘన విజయం సాధించడంతో, మనోజ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడని చెప్పాలి. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేస్తూ కెరీర్‌లో ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు.

Next Story