- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నను అవమానించిన మంచు మనోజ్.. వైరల్ అవుతున్న పోస్ట్.. ఇలా అయితే కష్టమేనంటూ..
మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా గ్రాండ్ లెవల్‌లో రిలీజ్ కాబోతోంది. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కనిపించబోయే సినిమాపైనే ఆస్తి మొత్తం పెట్టేసింది మంచు ఫ్యామిలీ. ఫలితం అదిరిపోతుందనే ఆశతో ఉంది

దిశ, వెబ్‌సైట్ : మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా గ్రాండ్ లెవల్‌లో రిలీజ్ కాబోతోంది. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కనిపించబోయే సినిమాపైనే ఆస్తి మొత్తం పెట్టేసింది మంచు ఫ్యామిలీ. ఫలితం అదిరిపోతుందనే ఆశతో ఉంది. ఈ క్రమంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కాగా ఇన్ని రోజులు మోహన్ బాబు, విష్ణుతో కాస్త వివాదం జరిగినా.. మంచు మనోజ్ కూడా కన్నప్ప మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలంటూ ట్వీట్ పెట్టాడు.
ముందుగా తండ్రి మోహన్ బాబును, తర్వాత మంచు విష్ణు పిల్లలను.. తర్వాత మూవీకి పని చేసిన స్టార్స్ అందరినీ.. ఈ పోస్ట్‌లో ప్రస్తావించాడు మనోజ్. హృదయ పూర్వకంగా చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నాడు. పెద్ద నోట్ రాసుకొచ్చాడు. కానీ ఇందులో తన అన్న మంచు విష్ణుకు ఆల్ ది బెస్ట్ చెప్పడం, ప్రేజ్ చేయడం కావాలనే మరిచిపోయాడు. దీంతో ఈ పోస్ట్‌పై స్పందిస్తున్న జనాలు.. ఒక్కటి మరిచిపోయావ్ అన్న అంటూ డిజప్పాయింట్ అవుతున్నారు. ఇలా అయితే మీరు మళ్లీ కలవడం కష్టమే అంటూ బాధపడుతున్నారు అభిమానులు.






