- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కఠిన నిర్ణయం తీసుకున్న మంచు మనోజ్.. సాకులు చెప్పాలని అనుకోవటం లేదంటూ పోస్ట్
యాక్షన్ చిత్రాల్లో ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు

దిశ, సినిమా: మంచు మనోజ్ తన అప్ కమింగ్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’ కోసం అగ్నిపరీక్షలాంటి వర్కవుట్స్ చేస్తూ షాకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సిద్ధమవుతున్నారు. కేవలం లుక్ కోసమే కాకుండా, రియల్ స్టంట్స్ చేసేందుకు అవసరమైన శారీరక దృఢత్వం కోసం గత మూడు వారాలుగా ఆయన కఠినంగా శ్రమిస్తున్నారు. ‘‘ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవలం కష్టం మాత్రమే. యాక్షన్ చిత్రాల్లో ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు’’ అని ఆయన అన్నారు. ఇక ఇటీవల ‘మిరాయ్’ సినిమాతో పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చిన మనోజ్, ఇప్పుడు ‘డేవిడ్ రెడ్డి’తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌పై కన్నేశారు. 1897-1920 నాటి బ్రిటిష్ వలస పాలన నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు.అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. అంతర్జాతీయ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది.






