- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబ గొడవలపై తొలిసారి స్పందించిన మంచులక్ష్మి.. దానివల్ల నాకేంటి లాభమంటూ షాకింగ్ కామెంట్స్
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకటై.. తనపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారంటూ మనోజ్ వాపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని నెలల క్రితం మంచు వారి ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకటై.. తనపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారంటూ మనోజ్ వాపోయారు. అప్పట్లో మంచువారి ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా మంచు లక్ష్మి స్పందించింది. ఏ కుటుంబంలోనైనా సమస్యలు వస్తే.. ఆ కుటుంబ సభ్యులంతా దానికి ఎఫెక్ట్ అవుతారని, అలా జరగదు అని చెప్తే అది అబద్ధమే అవుతుందన్నారు. కానీ.. సెలబ్రిటీ ఫ్యామిలీలు ఉండేది ఒక అద్దాల మేడలో అని, తాము ఏం చెప్పినా వాటి తల, తోక తీసేసి.. వాళ్లకు నచ్చినట్లు వార్తలు రాసుకునే రోజుల్లో బ్రతుకున్నామన్నారు. ఇలాంటి సొసైటీలో కొన్ని విషయాలపై సైలెంట్ గా ఉండటమే మంచిదని తన అభిప్రాయమని, అందుకే అప్పుడు మౌనంగా ఉన్నానని మంచులక్ష్మి చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు ఫ్యామిలీలో ఏదైనా సమస్య వస్తే.. ఏది మంచి, ఏది తప్పు అని ఆలోచించే తాను.. ఇప్పుడు అందుకు భిన్నంగా.. దాని వల్ల తాను ఆనందంగా ఉంటానా లేక బాధపడతానా అని మాత్రమే ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు. మన జీవితంలో ఏం జరిగినా అది మనకొక లెసన్ నేర్పిస్తుందని, ఏదైనా మౌనంగా ఆలోచిస్తే దానికి సమాధానంతో పాటు ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు. తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచి లక్ష్మి నటించిన సినిమా దక్ష సెప్టెంబర్ 19న విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.






