నా కెమెరాకే అడ్డొస్తావా.. వ్యక్తిపై దాడి చేసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్

by Disha Web Desk 7 |
నా కెమెరాకే అడ్డొస్తావా.. వ్యక్తిపై దాడి చేసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)’ వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అవార్డ్స్ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్స్ హీరో రానా, మంచు లక్ష్మి ప్రధాన వ్యాాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే సైమా అవార్డ్స్‌లో మంచు లక్ష్మి ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వేడుకలో ఆమె మీడియాతో మాట్లాతుండగా.. కొందరు కెమెరాకు అడ్డంగా వచ్చారు. దీంతో ఆమె ఆగ్రహానికి గురై వారిపై సీరియస్ అయ్యారు. ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకోగా.. మరో వ్యక్తిని కెమెరా వెనుక నుంచి వెళ్లాలి డ్యూడ్ అంటూ కోప్పడ్డారు. దీంతో ప్రతిష్టాత్మక అవార్డ్స్ వేడుకల్లో ఇలా చేయడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.



Next Story